News July 8, 2025

బడిబాటలో హైదరాబాద్ టాప్

image

బడిబాట‌లో హైదరాబాద్‌ రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడడంతో ఆదరణ పెరుగుతోంది. అధికారుల విస్తృత ప్రచారంతో కొత్త అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఈ ఏడాది గవర్నమెంట్ స్కూల్లో 1st క్లాస్‌లో HYD-6359, మేడ్చల్‌- 2962, రంగారెడ్డి-2127 అడ్మిషన్లు వచ్చాయి. ఇక 2వ తరగతి నుంచి పదో తరగతి వరకు HYD-9,674, మేడ్చల్‌-5262, రంగారెడ్డి-3642 మంది విద్యార్థులు సర్కారు బడిలో చేరారు.

Similar News

News July 8, 2025

కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలి: భట్టి

image

TG: సీఎం రేవంత్ సవాల్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే <<16989439>>కేటీఆర్<<>> జీర్ణించుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలని ఫైరయ్యారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామని, చర్చకు కేసీఆర్ రావాలని సవాల్ చేశారు. గోదావరి, కృష్ణ జలాలపై చర్చించేందుకు సిద్ధమన్నారు.

News July 8, 2025

విమాన లగేజీ రూల్స్‌పై చర్చ.. మీరేమంటారు?

image

విమానంలో ప్రయాణించే వారు తీసుకువెళ్లే లగేజీలపై ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఈ రూల్‌పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. 100 కేజీలున్న ఓ వ్యక్తి 24kgల లగేజీని తీసుకెళ్తే ఓకే చెప్తారని, అదే 45kgలున్న మరో వ్యక్తి 26kgల లగేజీ తెస్తే అడ్డు చెప్తారని ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు 24 గంటల్లోనే 85లక్షల వ్యూస్ లక్ష లైక్స్ వచ్చాయి. యువతి చెప్పిన విషయం కరెక్ట్ అని పలువురు మద్దతు తెలుపుతున్నారు.

News July 8, 2025

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.