News December 20, 2025

బడ్జెట్‌పై ఊహాజనిత అంచనాలు వద్దు: GOVT

image

TG: FY26-27 బడ్జెట్‌కు ఊహాజనిత అంచనాలు పంపొద్దని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ‘ఖర్చు హేతుబద్ధంగా ఉండాలి. ఎక్కువ/తక్కువలు లేకుండా వాస్తవ రిక్వైర్మెంట్ మాత్రమే పంపాలి. అవసరం మేరకే మెయింటెనెన్స్, రెంట్, వాహనాలకు ఖర్చు చేయాలి’ అని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విషయంలో రేట్ కాంట్రాక్ట్, కాలం, ఎంతమంది అవసరం, ఖర్చు అంశాలు HRM నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించింది.

Similar News

News December 22, 2025

SC తీర్పు అంశాలతో CWCకి నివేదిక

image

TG: అనుమతుల్లేని ప్రాజెక్టులపై ఇటీవల SC రాష్ట్రానికి అనుకూల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత తీర్పు అంశాలతో లీగల్ రిపోర్టును CWCకి సమర్పించాలని నిర్ణయించింది. పలుమార్లు తిరస్కరించిన ‘పాలమూరు-రంగారెడ్డి’ సహా ఇతర ప్రాజెక్టుల DPRలను ఆమోదించాలని కోరనుంది. వీటికి కృష్ణా జలాల కేటాయింపుపై ట్రైబ్యునల్ విచారణను కమిషన్‌కు నివేదించనుంది.

News December 22, 2025

తెలుగు కళల వైభవం చాటేలా ‘ఆవకాయ’ ఫెస్టివల్: కందుల

image

AP: తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరిట సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘AP వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా కళాకారులకు ఈ ఉత్సవం గొప్ప వేదికగా నిలుస్తుంది. అలాగే ఉగాదికి నంది అవార్డులు ఇస్తాం. నాటకోత్సవాలు నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

పవన్, NTR పిటిషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

SMలో అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు తమ ఫొటోలు వాడటంపై PK, NTR వేసిన పిటిషన్లను ఢిల్లీ HC విచారించింది. కొన్ని లింకులను తొలగించామని ప్రతివాదులు(flipkart, Amazon, X, Google, Meta) తెలపగా, ఆయా లింక్స్ యూజర్ల వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అవి ఫ్యాన్స్ ఖాతాల పోస్టులనే దానిపై స్పష్టతనివ్వాలని Instaకు సూచించింది. 3వారాల్లో BSI, IP వివరాలు అందించాలని ఆదేశిస్తూ విచారణను మే 12కి వాయిదా వేసింది.