News February 14, 2026

బడ్జెట్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్‌కు రూ. 638 కోట్లు

image

శాసనసభలో 2026-27 వార్షిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీకి రూ.638 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రంలోని పోలీసులకు 3,000 కొత్త పోలీసు వాహనాలు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం బడ్జెట్ కేటాయించారు.

Similar News

News February 14, 2026

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో నిన్న తెలుగులో రిలీజైన మలయాళ మూవీ ‘చథా పచ్చ’ వారానికే OTTలోకి రానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ రూ.30కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో మమ్ముట్టి ఇందులో అతిథి పాత్రలో మెరిశారు. రెజ్లింగ్ క్లబ్ ఏర్పాటులో ముగ్గురు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్ల ఇతివృత్తమే కథ.

News February 14, 2026

ఖమ్మం: అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మల్లెంపాటి శ్రీధర్

image

ఖమ్మంలోని శ్రీ చైతన్య గ్లోబల్ విస్తా పాఠశాల ‘ఆరంభ్’ ద్వితీయ వార్షికోత్సవంలో డా.తుమ్మల యుగంధర్, నాగళ్ళ దీపక్ చౌదరి పాల్గొన్నారు. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య సూచించారు. ‘ఫోక్ టు ఫ్యూషన్’థీమ్‌తో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు.

News February 14, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన AIFB విజేతలు
✒పాలమూరు: జాగృతి, AIFB ఉమ్మడి విజయం: జోజిరెడ్డి
✒జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ
✒పాలమూరుకు మహర్దశ.. రూ.3,175 కోట్లతో హైవే
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పాలమూరులో ‘గ్లాసు’ ఖాళీ.. ప్రభావం చూపని జనసేన
✒గద్వాల్:జంపింగ్ ఎమ్మెల్యేలకు BRS ‘విప్’ సెగ
✒శివరాత్రి.. రేపు ఆలయాల వద్ద బందోబస్తు:SP