News February 28, 2025

బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన

image

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం 9నెలల్లోనే రూ.1.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ లెక్కలు బడ్జెట్‌లో లేవని అన్నారు. బడ్జెట్‌ బుక్‌లో కలర్‌ ఎక్కువ కంటెంట్‌ తక్కువంటూ ఆయన సెటైర్లు వేశారు. బడ్జెట్ ప్రసంగంలో 35 సార్లు గత ప్రభుత్వం అని చెప్పారని, ఇంకెన్ని రోజులు తమ జపం చేస్తారని మండిపడ్డారు.

Similar News

News December 22, 2025

105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

image

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.

News December 22, 2025

మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

News December 22, 2025

ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.