News January 30, 2026
బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్?

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి అమలు చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయి. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆరేళ్ల తర్వాత వృద్ధులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేయనున్నారు. గతంలో పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ ఉండేది.
Similar News
News February 10, 2026
డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News February 10, 2026
జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.
News February 10, 2026
మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.


