News February 14, 2026

బడ్జెట్: కర్నూలు జిల్లాకు ఇలా..

image

★ ఓర్వకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే తొలి సమగ్ర డ్రోన్ సిటీ అభివృద్ధి
★ కర్నూలులో 30 పడకల ESI ఆసుపత్రి
★ పర్యాటక ప్రాంతంగా అహోబిలం అభివృద్ధి
★ ఏవీఆర్ హంద్రి-నీవా పూర్తికి చర్యలు
★ రాయలసీమను గ్లోబర్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి
★ సూపర్-6 పథకాలకు భారీ కేటాయింపులు.. జిల్లా ప్రజలకు లబ్ధి
★ జిల్లా పోలీసు శాఖకు కొత్త వాహనాల కేటాయింపు
★ పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై దృష్టి

Similar News

News February 14, 2026

పారిశ్రామిక‌వేత్త దిశ‌గా అడుగులేద్దాం: కలెక్టర్

image

ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స‌త్వ‌ర అనుమ‌తులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం గుంటుప‌ల్లిలోని రైజ్ కేంద్రంలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లా ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క క‌మిటీ స‌మావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోంద‌ని పేర్కొన్నారు.

News February 14, 2026

పార్టీల మధ్య ఆగని ‘వాలంటైన్స్ డే’ వార్

image

TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆగడం లేదు. మధ్యాహ్నం ఒకరిపై ఒకరు చేసుకున్న ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ‘BRS loves modi more than TG’ అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా ‘ఆయనకి ఇద్దరు’ పోస్టర్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు BJP కౌంటర్ ఇచ్చింది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పోస్టర్‌తో బీజేపీ, కాంగ్రెస్, MIMపై BRS సెటైర్లు వేసింది.

News February 14, 2026

శ్రీరాంపూర్: ‘బదిలీ వర్కర్లకు జనరల్ అసిస్టెంట్ ట్రైనీ హోదా’

image

సింగరేణిలో పనిచేస్తున్న బదిలీ వర్కర్లకు 2026 మార్చి నుంచి జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా నియామక ఉత్తర్వులు
ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ తెలిపారు. గతంలో బదిలీ వర్కర్ నుంచి జనరల్ అసిస్టెంట్‌గా మారడానికి కనీసం మూడేళ్ల సమయం పట్టేదన్నారు. కొత్త నిబంధన ప్రకారం 190/240 మస్టర్లు పూర్తి చేయగానే జనరల్ అసిస్టెంట్లుగా గుర్తిస్తారని పేర్కొన్నారు.