News February 1, 2026

బడ్జెట్ బూస్ట్.. ఎగసిన స్టాక్ మార్కెట్లు

image

ఉదయం ఫ్లాట్‌గా మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చాయి. కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత మెల్లగా పైకెగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్లు, సెన్సెక్స్ 250 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 25,370, సెన్సెక్స్ 82,521 వద్ద కొనసాగుతున్నాయి.

Similar News

News February 5, 2026

$400bn మార్కును దాటిన గూగుల్ రెవెన్యూ: సుందర్ పిచాయ్

image

గూగుల్ యాన్యువల్ రెవెన్యూ తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిందని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. FY25 Q4 ఫలితాలను ఆయన వెల్లడించారు. 2025లో యూట్యూబ్ రెవెన్యూ 60 బిలియన్ డాలర్లను దాటినట్లు పేర్కొన్నారు. జెమినీ యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 750M+గా ఉన్నట్లు చెప్పారు. AI స్టాక్, జెమినీ 3 అడాప్షన్ తమ కంపెనీ ప్రోగ్రెస్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తున్నాయని వివరించారు.

News February 5, 2026

ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>AIIMS <<>>గోరఖ్‌పూర్ 22 జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MBBS అర్హత గలవారు ఫిబ్రవరి 11న, BDS అర్హత గలవారు ఫిబ్రవరి 14న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.56,100 +NPA చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in

News February 5, 2026

ఉదయం లేవగానే ఇది కనిపించిందా?

image

శాస్త్రాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే బల్లిని చూడటం అదృష్టం. ఇది మీ దురదృష్టం తొలగి, విజయం వరించడాన్ని సూచిస్తుంది. బల్లి గోడపైకి పాకుతూ కనిపిస్తే పదోన్నతికి, ఆర్థిక లాభానికి సంకేతం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బల్లి తలపై పడితే సమాజంలో గౌరవం పెరుగుతుందని, భుజంపై పడితే పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుందని నమ్మకం. ఈ శుభ శకునాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, సిరిసంపదలను తీసుకువస్తాయి.