News January 10, 2026
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్‌తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.
Similar News
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 11, 2026
అష్టమ శనితో వివాహం ఆలస్యం!

జాతకంలో ఎనిమిదో స్థానంలో శని సంచరిస్తే పెళ్లి సంబంధాలు ఆగిపోతాయని అంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో రోజూ ‘హనుమాన్ చాలీసా’ పఠించాలి. అది రక్షణ కవచంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం చేయాలి. కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టాలి. వికలాంగులకు సాయం చేస్తే శని ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఓర్పుతో చేసే దైవ ప్రార్థన వివాహ మార్గంలోని ముళ్లను తొలగిస్తుంది.


