News February 7, 2025
బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్..!
మనిషి బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు పేరున ఉన్న ఎల్ఐసీ బీమా డబ్బులను కాజేసేందుకు ఏజెంట్ ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా పది లక్షల భీమా సొమ్ము పొంది బాధితుడికి 3.5 లక్షలు ఇచ్చి మిగతావి ఏజెంట్ కాజేశాడు. విషయం బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.
Similar News
News February 7, 2025
కుంభమేళాలో పాక్ హిందువుల స్నానాలు
మహా కుంభమేళాలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి 68మంది హిందువులు ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. తమది సింధ్ ప్రావిన్స్ అని, 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ మహత్తర సందర్భాన్ని మిస్ చేసుకోలేక భారత్‌కు వచ్చామని వివరించారు. ‘హరిద్వార్‌కు వెళ్లి మా అందరి పూర్వీకుల అస్థికల్ని గంగలో కలిపాం. మా మతం గొప్పదనాన్ని తొలిసారిగా మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.
News February 7, 2025
ఢిల్లీ దంగల్: ఆప్‌పై ACBకి BJP ఫిర్యాదు?
ఫలితాలకు ముందే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆప్‌పై ACBకి ఫిర్యాదు చేసేందుకు BJP సిద్ధమవుతున్నట్టు సమాచారం. 16 మంది MLAలకు ₹15CR చొప్పున ఇస్తామంటూ తమ నేతలకు BJP ఎరవేసిందని కేజ్రీవాల్ నిన్న ఆరోపించారు. దీనిపై మండిపడ్డ కమలం పార్టీ ఓటమికి కారణాలు చెప్పలేకే ఆప్ కొత్త నాటకం ఆడుతోందని విమర్శించింది. రిజల్టే రాలేదు, ఎవరు గెలుస్తారో తెలీదు, మరి MLAలకు ఎలా ఎరవేస్తారంటూ నెటిజన్లూ ట్రోల్ చేస్తున్నారు.
News February 7, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వి.నరేందర్ రెడ్డి
ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్,మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వి.నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.