News September 23, 2025

బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించాలని జనగామ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. చెరువుల వద్ద భద్రత, పరిశుభ్రత, లైటింగ్, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో బతుకమ్మ మోడల్స్, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు, పౌష్టికాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News September 23, 2025

నెల్లూరు: ‘నమ్మకంగా ఉంటూ నగదు కొట్టేశాడు’

image

నెల్లూరు బాలాజీ నగర్ పరిధిలోని కలికి కోదండరామిరెడ్డి అనే వ్యాపారవేత్త వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బుకొట్టేసిన డ్రైవర్ మహేశ్ నాయక్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.2 కోట్ల 10 లక్షలు దొంగలించగా అతనివద్ద నుంచి రూ.కోటి 96 లక్షల 29వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు, అతనికి సహకరించినవారివద్ద నుంచి 10 లక్షల నగదుతోపాటు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర DSP సింధుప్రియ తెలిపారు.

News September 23, 2025

గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య అంశాలపై మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

News September 23, 2025

ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

image

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.