News September 12, 2025

బతుకమ్మ, దసరా బందోబస్తుపై సీపీ సమీక్ష

image

బతుకమ్మ, దసరా పండుగలు, ఇతర వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై హైదరాబాద్ సీపీ ఆనంద్ ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరిగే మిలాద్ ప్రొసెషన్, సెప్టెంబర్ 22 వరకు జరిగే దుర్గమాత విగ్రహాల ప్రతిష్ఠాపనలతోపాటు అన్ని పండుగలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News April 15, 2026

విమానంలో ఫోన్ వాడితే డేంజరా?

image

విమానంలో ప్రయాణికుల ఫోన్లను కచ్చితంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోమంటారు. అలా చేయకపోతే డేంజరనే భయం కొందరిలో ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్‌‌లో లేనంత మాత్రాన ప్లేన్ కూలిపోదని, కానీ కొంత రిస్క్ ఉందంటున్నారు పైలట్లు. ‘ఫ్లైట్ మోడ్‌లో లేకుంటే ఫోన్లు సిగ్నల్స్ రాబట్టేందుకు యత్నిస్తాయి. పైలట్ల హెడ్‌సెట్స్‌కు వచ్చే రేడియో వేవ్స్ డిస్ట్రబ్ అయ్యి శబ్దం వస్తుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని చెబుతున్నారు.

News April 15, 2026

హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

image

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.

News April 15, 2026

సిరిసిల్ల: వృద్ధురాలి దారుణ హత్య

image

వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్‌కు చెందిన కోన లక్ష్మమ్మ (75) ఒంటరిగా నివసిస్తుంది. మంగళవారం ఉదయం చిన్న కుమారుడు వెంకటేశ్ తల్లి వద్దకు వచ్చేసరికి ఆమె రక్తం మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.