News September 16, 2025
బతుకమ్మ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు: కమిషనర్

బతుకమ్మ పండుగ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులతో బతుకమ్మ ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు సూచనలు చేశారు.
Similar News
News September 17, 2025
అక్టోబర్ 2 వరకు ఉచిత వైద్య సేవలు: DMHO

ఈనెల 17నుంచి అక్టోబర్ 2వరకు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు DMHO డాక్టర్ విశ్వేశ్వరనాయుడు తెలిపారు. మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో జిల్లాలోని 64 పీహెచ్‌సీల ద్వారా నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. అవగాహన కార్యక్రమాలు, పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం తదితర వ్యాధులకు పరిక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామన్నారు.
News September 17, 2025
TODAY HEADLINES

★ ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టుల ప్రకటన
★ రాహుల్ గాంధీపై పాక్ మాజీ క్రికెటర్ ఆఫ్రిది ప్రశంసలు
★ ప్రైవేట్ హాస్పిటళ్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
★ 15% వృద్ధి రేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
★ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను రేవంత్ అమ్ముకున్నారు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
★ వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ
★ పంటల ధరల పతనంలో చంద్రబాబు రికార్డు: YS జగన్
News September 17, 2025
‘నా మిత్రుడు ట్రంప్’కు ధన్యవాదాలు: PM మోదీ

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.