News October 9, 2024

బతుకమ్మ: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్!

image

సద్దుల బతుకమ్మ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ అంతటా రేపు రాత్రి సందడే సందడి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి ట్యాంక్‌బండ్‌‌కు తీసుకొస్తారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు బాగ్‌లింగంపల్లి, KPHB, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌లోని GHMC మైదానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు బతుకమ్మ పాటలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

Similar News

News December 30, 2024

HYD: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు

image

నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

News December 30, 2024

HYD: న్యూ ఇయర్.. రిసార్టులకు ఫుల్ డిమాండ్..!

image

న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్‌పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.

News December 30, 2024

గ్రేటర్లో ఓవైపు చలి.. మరోవైపు కరెంటు వినియోగం

image

గ్రేటర్ HYDలో ఓవైపు చలి పెరుగుతూ వస్తుంటే దానికి తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYDలో 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. దాదాపు 56 యూనిట్లకు పైగా రికార్డులు నమోదు కాగా.. విద్యుత్ కనెక్షన్లు పెరగడం, పరిశ్రమల వాడకం, ఉదయం పూట ఇళ్లలో గీజర్లు వినియోగించడం కారణాలుగా అధికారులు చెప్పుకొచ్చారు.