News October 3, 2024

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి

image

తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ ప్రతీక అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో బుధవారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.

Similar News

News October 3, 2024

గాంధీ జయంతి సందర్భంగా వికలాంగులకు స్కూటీల పంపిణీ

image

మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో వికలాంగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూటీలు పంపిణీ చేశారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వికలాంగులై ఉండి రానివారికి మరొక విడుతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ చైర్మన్ ఆకుల లలిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు.

News October 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఓదెల మండలంలో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.
@ వీణవంక మండలానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పురుగు మందు తాగిఆత్మహత్య.
@ హుస్నాబాద్ మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
@ కోరుట్లలో గుండెపోటుతో బిజెపి నేత మృతి.

News October 2, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,02,748 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,363, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.24,920, అన్నదానం రూ.23,465 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.