News October 24, 2025

బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి

image

కర్నూలు శివారు చిన్నటేకూరులో జరిగిన ప్రమాదంలో <<18087280>>కావేరి<<>> ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ద్విచక్రవాహనం బస్సు ఇంధన ట్యాంకును ఢీకొని మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడ్డారు. 20 మంది వరకు చనిపోయినట్లు చెబుతున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Similar News

News October 24, 2025

కర్నూల్ ప్రమాదం.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులు సేఫేనా?

image

కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు <<18087723>>ప్రవేట్ ట్రావెల్స్<<>> బస్సులను ఆశ్రయిస్తారు. ఘటనలు జరిగినప్పుడు ఈ ట్రావెల్స్ బస్సులు ఎంత వరకు సేఫ్ అన్నదానిపై చర్చ నడుస్తోంది. కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు తీరిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశంలో ట్రావెల్స్ బస్సులు అంతా ఫిట్‌గా ఉన్నాయా.?

News October 24, 2025

ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

News October 24, 2025

మెదక్: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన బాయికాడి రాజమణికి కౌడిపల్లి బస్టాండ్‌ వద్ద బస్సులో గుండెపోటు వచ్చింది. బంధువులు కౌడిపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.