News March 18, 2024
బత్తలపల్లిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఉన్న వ్యవసాయ పొలంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. నర్సింపల్లి రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్‌కు చెందిన వ్యవసాయ పొలంలో విద్యుత్ వైర్ల మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్తంభం ఎక్కాడు. విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. బత్తలపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా.. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2026
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

రేపు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లాలో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
News February 16, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.