News April 5, 2025
బదనకల్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ముస్తాబాద్ మండలం బాదనకల్ గ్రామంలోని ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. పాతూరి మల్లమ్మ(54) గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఆమె వ్యాధి నయం కాలేదు. శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
Similar News
News September 17, 2025
నిజాంసాగర్: దిగువకు 82 వేల క్యూసెక్కులు విడుదల

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహంతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి 82,056 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు, ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని వ్యవసాయ అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 57,268 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
News September 17, 2025
HYD: దుర్గా మాత విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్ నమోదు

సైబరాబాద్‌లో దుర్గామాత నవరాత్రి వేడుకలకు విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. భక్తులు, యువకులు, మండపాల నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని తెలిపారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.
News September 17, 2025
ASF: రక్తదానం చేసి ప్రాణదాతలు కండి: బీజేపీ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం పడుతుందన్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని అన్నారు.