News January 14, 2025

బద్వేల్: సంక్రాంతి పండుగ రోజు విషాదం

image

బద్వేలు మండలం గుండంరాజుపల్లె సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై నుంచి అదుపుతప్పి ఇద్దరు కింద పడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవికుమార్ విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 7, 2025

20 నుంచి కడపలో రక్తదాన శిబిరాలు

image

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ పోయవచ్చని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కడపలోని రెడ్‌క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాల్లో జులై 20 నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.

News July 7, 2025

కడప జిల్లా ప్రజలకు గమనిక

image

కడప కలెక్టరేట్‌లో ఇవాళ గ్రీవెన్స్ డే జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సభా భవనంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అంతకంటే ముందు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. ప్రజలు 08562-244437కు కాల్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు కోరారు.

News July 7, 2025

కడప జిల్లాల్లో 159 మంది అరెస్ట్

image

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ‘జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న 159 మందిని అరెస్టు చేశాం. రూ. 2.85 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. 9మట్కా కేసుల్లో 16మందిని అరెస్టు చేసి రూ.50,570 సీజ్ చేశాం. రూ.1.4కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. బహిరంగంగా మద్యం తాగిన 986 మందిపై కేసులు నమోదు చేశాం’ అని SP చెప్పారు.