News July 20, 2024

బయటకు వెళ్లిపోదామనుకున్నా: చెవిరెడ్డి

image

వైసీపీలో ఏ ఒక్కరిపై చేయి వేసినా ఊరుకునేది లేదని చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన నానికి పరిపాలించే అవకాశం ఇద్దామనుకున్నా. బయటకు వెళ్లి వ్యాపారం చేసుకుందామని భావించా. కానీ నన్ను నమ్మిన కార్యకర్తలను రోజూ కొడుతూనే ఉన్నారు. అది చూడలేకపోతున్నా. ఇకపై పూర్తి సమయం కార్యకర్తలకే కేటాయిస్తా. ప్రతిపక్షంలో నా పోరాటం ఎలా ఉంటుందో ముందు చూస్తారు’ అని చెవిరెడ్డి అన్నారు.

Similar News

News September 13, 2025

బార్లకు దరఖాస్తు గడువు పొడిగింపు.. 17 లాస్ట్

image

చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 6 బార్లకు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.18వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో బార్‌ల కేటాయింపు జరుగుతుందన్నారు.

News September 12, 2025

నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకాలు నిషేధం: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.

News September 12, 2025

చిత్తూరు జిల్లాలోని ఈ మండలాల్లో రేపు పవర్ కట్

image

జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.