News October 25, 2025

బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్‌

image

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగుల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణకు ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని ఆయన అన్నారు.

Similar News

News October 25, 2025

ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

image

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 25, 2025

GNT: 74 ఏళ్ల క్రితం.. ఇదే రోజు మొదటి సార్వత్రిక ఎన్నిక.!

image

1951 అక్టోబర్ 25న గుంటూరుకు సంబంధించి ముఖ్యమైన సంఘటన జరిగింది. 1951 అక్టోబర్ 25న భారతదేశంలో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు గుంటూరు సహా దేశవ్యాప్తంగా జరిగాయి. ఎన్నికలలో గుంటూరు నుంచి ఎస్‌.వి లక్ష్మీ నరసింహం (IND) 79350 ఓట్లు, తెనాలి నుంచి కొత్తా రఘురామయ్య (INC) 103126 ఓట్లు, నరసరావుపేట నుంచి చాపలమడుగు రామయ్య చౌదరి (IND) 78332 ఓట్ల మెజారిటీతో ఎంపీలుగా గెలుపొందారు.

News October 25, 2025

నల్గొండ: DCC.. ఎవరి ‘హస్త’గతమవుతుందో..!

image

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి డీసీసీలు నేడు ఖరారు కానున్నారు. నల్గొండ నుంచి మోహన్ రెడ్డి, మల్లయ్య, పున్నా కైలాష్ నేత, చనగాని దయాకర్, వెంకట్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నుంచి MLA పద్మావతి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, తండు శ్రీనివాస్ అప్లై చేశారు. పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.