News December 26, 2025
బయ్యారం: కరెంట్ షాక్‌తో ఉద్యోగి మృతి

బయ్యారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట సబ్ స్టేషన్ పరిధి కాచనపల్లికి చెందిన ఓ రైతు తమ విద్యుత్ మోటారుకు ఫీజులు ఆగడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి ఊకే వెంకటేశ్వర్లు పరీక్షిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఘటన సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 28, 2025
గూడెం కొత్తవీధి: ఆరో తరగతి విద్యార్థిని మృతి

గూడెం కొత్తవీధి మండలం సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాలలో విషాదం నెలకొంది. ఆరో తరగతి చదువుతున్న పాంగి నిర్మల (11) ఆదివారం అకస్మాత్తుగా మరణించింది. శనివారం జ్వరంతో బాధపడగా చికిత్స చేయించారు. ఆదివారం పాఠశాలలో ఒక్కసారిగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యాధికారి నారాయణరావు ధృవీకరించారు. చిన్న వయసులోనే విద్యార్థిని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News December 28, 2025
U-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

చిన్న వయసులోనే తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. కేవలం 14ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా U-19తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. U-19 వరల్డ్ కప్‌కు ముందు జరిగే ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో BCCI వైభవ్‌కు బాధ్యతలు అప్పగించింది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
News December 28, 2025
జగన్ అంతా తెలుసు అనుకుంటారు: లోకేశ్

AP: PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని YCP వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఓ వార్తను రీట్వీట్ చేస్తూ Ex.CM జగన్‌కు చురకలంటించారు. ‘కేంద్రం, సీనియర్ ఎడిటర్స్, డొమైన్ ఎక్స్‌పర్ట్స్ అంతా వైద్య విద్యలో సామర్థ్యాన్ని పెంచేందుకు PPP విధానం సరైందని నమ్ముతున్నారు. కానీ, మన విధ్వంసక ప్రతిపక్ష నాయకుడు మాత్రం అందరికంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటారు’ అని ట్వీట్ చేశారు.


