News March 18, 2025

బయ్యారం: పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

image

కాకతీయ నగర్‌ కాలనీలో సోమవారం అజ్మీర(సాయి) మహేశ్(18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

బుట్టాయిగూడెం: గుబ్బల మంగమ్మ తల్లి సేవలో నటుడు నితిన్

image

బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలోని శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని తెలుగు సినీ నటుడు నితిన్ సోమవారం దర్శించుకున్నాడు. ఈ సందర్భంగానే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తను నూతనంగా నటించిన రాబిన్ హుడ్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, చిత్రం ఘన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు నటుడు నితిన్ తెలిపాడు

News March 18, 2025

విజయనగరం: మహిళలు శక్తి యాప్‌ను తప్పనిసరిగా వాడాలి

image

రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 18, 2025

ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

image

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

error: Content is protected !!