News February 27, 2026

బరువు తగ్గాలా? వీటిని డైట్ నుంచి తీసేయండి

image

బరువు తగ్గాలనుకునేవారు కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్‌లు, ఫాస్ట్ ఫుడ్‌ని వెంటనే డైట్ నుంచి తొలగించాలని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్, బిస్కెట్ల వంటి రిఫైన్డ్ కార్బ్స్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ని పెంచి ఆకలిని కలిగిస్తాయి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, మయోనైజ్ వంటి హై క్యాలరీ సాస్‌లకు దూరంగా ఉండాలి. వీటికి బదులు హోల్ గ్రెయిన్స్, నట్స్, పండ్లు, నీళ్లు ఎక్కువగా తాగితే హెల్తీగా బరువు తగ్గొచ్చు.

Similar News

News February 28, 2026

అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

image

TG: హైదరాబాద్ నుంచి అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్‌(17069/17070) సర్వీస్‌గా నడపనున్నట్లు తెలిపింది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని పేర్కొంది. దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించింది.

News February 28, 2026

7 మ్యాచుల్లో 4 POTM అవార్డులు

image

T20WC-2026లో ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఇంగ్లండ్‌కు వరంలా మారారు. అతడు 7 మ్యాచుల్లో 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. 176 స్ట్రైక్ రేట్‌తో 191 రన్స్ చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. కీలక సమయాల్లో రాణిస్తూ ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తున్నారు. నిన్న NZపై సైతం చివరి ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపుతిప్పారు.

News February 28, 2026

252 ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 252 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in