News February 18, 2025
బర్డ్‌ఫ్లూ బఫర్ జోన్‌లో నిరంతర అప్రమత్తత: కలెక్టర్

గంపలగూడెం మండలంలోని కోళ్ల మరణాలకు సంబంధించి బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో 10 కిలోమీటర్ల పరిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలను కొనసాగించాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. అనుమల్లంక ఘటన నేపథ్యంలో నివారణ, నియంత్రణ చర్యలపై సమీక్షించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
Similar News
News November 10, 2025
నేడు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
News November 10, 2025
10న యథావిధిగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: కలెక్టర్

అమలాపురం కలెక్టరేట్‌లో ఈనెల 10 సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.


