News February 13, 2025

బర్డ్ ప్లూతో కంట్రోల్ రూం ఏర్పాటు: కలెక్టర్

image

ఉంగుటూరు(M) బాదంపూడిలో పౌల్ట్రీలో బర్డ్ ప్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందని, 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణ కార్యాచరణ పై కలెక్టర్ పలు శాఖల వారితో సమీక్షించారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నంబర్ 9966779943 ఏర్పాటు చేశామన్నారు. బర్డ్స్ ఎక్కడ చనిపోయినా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 23, 2025

Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

News December 23, 2025

‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

image

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.

News December 23, 2025

KMR: నమస్తే సర్పంచ్ సాబ్! ఇక పల్లెల్లో అభివృద్ధి పరుగులే

image

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నేటి నుండి పూర్తిస్థాయి పాలన ప్రారంభం కావడంతో, ఆగిపోయిన అభివృద్ధి పనులు ఇకపై ఊపందుకోనున్నాయి.