News February 6, 2026
బర్డ్ ఫ్లూతో కాకులు మృతి.. చెన్నైలో అలర్ట్

తమిళనాడులో బర్డ్ ఫ్లూ కేసులు కలవరపెడుతున్నాయి. చెన్నైలోని అడయార్, అవడి, ఈసీఆర్‌లో జనవరి నుంచే 1000కిపైగా కాకులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కాకుల మరణంపై బోపాల్‌లోని లాబోరేటరీలో చేసిన పరీక్షల్లో H5N1 వైరస్ కారణమని తేలింది. దీంతో పక్షులు చనిపోయి కనిపిస్తే తాకకూడదని, పిల్లలను దూరంగా ఉంచాలని ప్రజలకు అధికారులు సూచించారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలన్నారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. రాత్రంతా మద్యం తాగుతూ..

AP: మదనపల్లెలో బాలికపై హత్యాచారం తర్వాత నిందితుడు కులవర్ధన్ నాటకమాడినట్లు తెలుస్తోంది. చిన్నారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ‘పాప కనిపించిందా? వీధుల్లోని CC కెమెరాలను పరిశీలించండి’ అని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతదేహాన్ని బయటకు తరలించే వీలులేక, పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాత్రంతా మద్యం తాగినట్లు సమాచారం. ఇంట్లోకి పోలీసులు రాగానే ‘నా పనైపోయింది’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
News February 19, 2026
రాగికి పెరుగుతున్న డిమాండ్

ఎలక్ట్రికల్, నిర్మాణ, రవాణా తదితర రంగాల్లో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాడకం విపరీతంగా పెరుగుతుండడంతో 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ 42 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. సప్లైలో తగినంత వృద్ధి లేకపోతే 2040 నాటికి 10 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడవచ్చని అంచనా. ప్రస్తుతం టన్ను కాపర్ ధర దాదాపు 13వేల డాలర్లు (₹11,80,000) ఉంది.
News February 19, 2026
ఉదయాన్నే టిఫిన్ చేయాల్సిందేనా?

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం కేవలం బరువుపైనే కాదు.. ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేవారికి గుండె జబ్బుల ముప్పు 27%, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పురుషుల్లో 21%, మహిళల్లో 20% పెరుగుతోంది. ఉదయం టిఫిన్ చేయకపోతే శరీరంలో గ్లూకోజ్, లిపిడ్ కంట్రోల్ తప్పడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయని తేలింది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా దెబ్బతింటున్నట్లు తెలిసింది.


