News April 2, 2025
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో అధికారుల ఎలర్ట్

నరసరావుపేటలో పచ్చి చికెన్‌ను తిని బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడి బాలిక మృతి చెందడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక ఇంటితో పాటు సమీప ప్రాంతాలలో నివసించే వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో తొలి బర్డ్ ఫ్లూ మృతి కేసు కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చికెన్ షాపుల్లో సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
Similar News
News April 3, 2025
గుంటూరు జిల్లాలో 1.20 లక్షల నిరుపేదలు

జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన పి-4 సర్వే ప్రకారం 1.20లక్షల మంది నిరుపేదలున్నట్టు గుర్తించారు. సర్వే పూర్తైన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. గత నెల 8నుంచి ఈ సర్వేను ప్రారంభించి, ఇంటింటికీ వెళ్లి అత్యంత నిరుపేదలుగా ఉన్న 20శాతం మందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఈసర్వే గుంటూరు వెస్ట్, ఈస్ట్, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల్లో చేశారు.
News April 3, 2025
అంబటి ఫిర్యాదు నమోదు చేయండి: హైకోర్టు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ, సామాజిక మాధ్యమాలలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు అంబటి ఫిర్యాదు చేశారు. మొత్తం ఐదు ఫిర్యాదులు ఇవ్వగా నాలుగు మాత్రమే నమోదు చేయడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు.
News April 3, 2025
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ఫోన్ హ్యాక్

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె ప్రత్తిపాటి స్వాతి ఫోను బుధవారం హ్యాక్ అయ్యింది. ఈ మేరకు డబ్బులు కావాలంటూ చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులకు వాట్సప్ సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపించారన్నారు. నేరగాళ్లు ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే స్పందించవద్దని టీడీపీ సోషల్ మీడియా గ్రూపులలో సిబ్బంది మెసేజ్ పెట్టింది.