News April 4, 2025

బర్డ్ ఫ్లూ కాదు… బాలిక మృతికి ఇతర కారణాలే

image

నరసరావుపేటలో బాలిక మృతిపై బర్డ్ ఫ్లూ అనుమానాలు తొలగిపోయాయి. ICMR బృందం తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాధినిరోధక శక్తి లోపం, అపరిశుభ్రత, లెప్టోస్పిరోసిస్‌ వంటి కారణాలే ప్రాణాపాయానికి దారితీశాయని తేలింది. బాలిక నుంచి H5N1 లక్షణాలు కనుగొన్నా, పరిసరాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యాధికారులు అన్నారు.

Similar News

News July 8, 2025

GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

image

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.

News July 8, 2025

గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

image

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.

News July 8, 2025

GNT: ఆన్లైన్ ట్రేడింగ్ మాయలో భారీ నష్టం.. ఎస్పీకి ఫిర్యాదు

image

పొన్నూరు ఇటికంపాడు రోడ్డుకు చెందిన మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి గురయ్యారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ ప్రారంభించగా, కాల్స్ ద్వారా ఆకర్షితుడై రూ.27 లక్షలు మోసపోయారు. మొదట లాభాలంటూ ఆశ చూపి తర్వాత మొత్తం కట్టించారని, తర్వాత ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని సోమవారం ఆయన ఎస్సీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.