News October 5, 2025
బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని తీర్మానం: వైసీపీ

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశంలో తీర్మానించింది. ఆదివారం విశాఖ జిల్లా ఆనందపురం చెన్నా కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, సీనియర్ పార్టీ నాయకుడు వీసం రామకృష్ణ బల్క్ డ్రగ్ పార్క్ విషయాన్ని ప్రస్తావించారు. రిలే దీక్షలు చేస్తున్న మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు.
Similar News
News April 5, 2026
నిజామాబాద్: మున్సిపాలిటీల్లో కో- ఆప్షన్ సందడి..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల సందడి మొదలైంది. ఖాళీగా ఉన్న పదవుల కోసం ఆశావహుల సంఖ్య పెరగడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అధికార పార్టీ నేతల వద్ద ఆశావహులు పైరవీలు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయతను ప్రాతిపదికగా తీసుకొని తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కౌన్సిలర్ల మద్దతు కూడగట్టేందుకు నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు.
News April 5, 2026
కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో అధిష్టానం కీలక నిర్ణయం?

తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోనున్నాయనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ సమీకరణాల్లో భాగంగా కోమటిరెడ్డి సోదరుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో జరగబోయే మార్పుల్లో మంత్రి వెంకటరెడ్డి స్థానంలో సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి పదవి వరించబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
News April 5, 2026
కర్నూలు: రూ.9 వేలకు పెరిగిన ధర

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర శనివారం పెరిగింది. క్వింటా రూ.9,079గా నమోదైంది. వారం రోజులుగా రూ.100 చొప్పున పెరుగుతూ వస్తూ నిన్న రూ.9 వేలకు చేరుకుంది. 1,248 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు యార్డ్ అధికారులు తెలిపారు. గరిష్ఠ ధర రూ.9,079, మధ్యస్థ ధర రూ.8,742, కనిష్ఠ ధర రూ.4,189కి కొనుగోలు చేశారు.


