News July 7, 2025
బల్దియా కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరు

వరంగల్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా మంత్రి కౌన్సిల్ సమావేశానికి రాలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కౌన్సిల్ సమావేశంలో మేయర్ సుధారాణి అధికారికంగా బల్దియా బడ్జెట్‌ను ప్రకటించారు.
Similar News
News July 7, 2025
పెద్దపల్లి: జులై 15లోపు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం జులై 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఎఫ్ క్యాటగిరీలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, జీ క్యాటగిరీలో స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం ఉన్న ముగ్గురిని నాన్ SC, STలను సభ్యులుగా ఎంపిక చేస్తారు. సేవల ఆధారాలతో కూడిన దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారికి సమర్పించాలని పేర్కొన్నారు.
News July 7, 2025
పాడేరు: ప్రతీ విద్యార్ధి తల్లి పేరున మొక్కలు నాటాలి

ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. ఈనెల 10న నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్‌ను అన్ని యాజమాన్యాల విద్యా సంస్థల్లో విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ విద్యార్థి తల్లి పేరున మొక్కలు నాటాలన్నారు. పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని చెప్పారు.
News July 7, 2025
ఈనెల 11 నుంచి OTTలోకి కొత్త సినిమా

‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్, హనురెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ‘8 వసంతాలు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈనెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.