News January 6, 2026
బల్దియా.. 3 ముక్కలు అవుతోందయా!

పరిపాలనా సౌలభ్యం కోసం GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం 12 జోన్లు, 60 సర్కిళ్లతో ఉన్న బల్దియాను 6 జోన్ల HYD, 3 జోన్ల చొప్పున సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల బదిలీలు, JCల నియామకాలు జరుగుతున్నాయి. పాలక మండలి పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త కార్పొరేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశముంది.
Similar News
News January 7, 2026
HYD: 1000 డాలర్ల కోసం నిఖిత హత్య?

అమెరికాలో HYD యువతి నిఖిత హత్యకు డబ్బుల విషయమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. US పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అర్జున్ శర్మకు నిఖిత 4500 డాలర్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అందులో 3500 డాలర్లు ఇవ్వగా మిగతా డబ్బులు ఇవ్వాలని నిఖిత అడిగింది. ఈ క్రమంలో గొడవ పెద్దదై అర్జున్ నిఖితను హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతురాలి తండ్రి కూడా <<18770024>>డబ్బుల విషయమే<<>> హత్యకు కారణం అయ్యిందని మీడియా ద్వారానే తెలిసిందన్నారు.
News January 7, 2026
HYDలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

సంక్రాంతి సందర్భంగా HYDలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16- 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. అలాగే పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు తదితర ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగ నిర్వహిస్తారు. వీటితో పాటు జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.
News January 7, 2026
HYD టాస్క్‌ఫోర్స్‌లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


