News April 13, 2025
బల్లికురవ: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి నరసరావుపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News September 19, 2025
RBSK తో చిన్నారులలో ముందస్తు గుర్తింపు.. సమగ్ర సంరక్షణ

పిల్లల ఆరోగ్య భద్రతకు PDPL జిల్లాలో RBSK కార్యక్రమం సమర్థంగా అమలవుతోంది. 18ఏళ్ల లోపు పిల్లల్లో 4D’s లోపాలు, వ్యాధులు, అభివృద్ధి లోపాల ముందస్తు గుర్తింపు, చికిత్స కోసం 10మొబైల్ హెల్త్ బృందాలు పనిచేస్తున్నాయి. లక్ష్యం 2,39,594లో 2,35,800 మందిని స్క్రీనింగ్ చేసి, 35,655 మందిలో వ్యాధులు గుర్తించారు. వీరిలో 29,118 మందికి తక్షణ చికిత్స అందించగా, 6,537 మందిని రిఫర్ చేశారు. అందులో 5,527 మంది కోలుకున్నారు.
News September 19, 2025
మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
News September 19, 2025
RG-3: యాజమాన్యం మొండి వైఖరి వల్లే సమావేశం బహిష్కరణ

సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని ఏఐటియుసి బహిష్కరించారని జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్ అన్నారు. గురువారం RG-3 ఏరియా OCP-2లో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లపై యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయాలని, కార్మికులకు 35శాతం లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైవీ రావు,MRC రెడ్డి తదితరులు పాల్గొన్నారు.