News December 2, 2024

బల్లికురవ: ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం

image

13 నెలల చిన్నారి ఖాన్సాకు తల్లిదండ్రులు ఎటువంటి కష్టం రాకుండా పెంచుకున్నారు. చిన్నపాటి అనారోగ్యంగా ఉండటంతో చిలకలూరిపేట ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి వస్తుండగా గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ కళ్లెదుటే, చేతుల్లోనే చిన్నారి మృతి చెందడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన బల్లికురవ మండలంలోని వేమవరంలో ఆదివారం జరిగింది. వీరిది సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామం.

Similar News

News December 26, 2024

ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం

image

ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 26, 2024

శానంపూడిలో యువతి ఆత్మహత్య 

image

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 26, 2024

బాపట్ల: రేపు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్

image

బాపట్ల జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌ను జిల్లాలోని ఎస్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.