News February 4, 2025
బషీరాబాద్‌లో దారుణ హత్య
బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 4, 2025
భయమెందుకు.. పోరాడితే గెలుపు నీదే!
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా దానిని జయించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాధి విజేతలంటున్నారు. ‘క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం’ అని క్రికెటర్ యువరాజ్ చెప్పారు. ‘నాకు బాధితురాలిగా ఉండటం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటులేదు’ అని నటి హంసా నందిని అన్నారు. ‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను ఇస్తాడు’ అని నటుడు సంజయ్ దత్ చెప్పారు. భయాన్ని వీడి పోరాడి గెలవండి.
News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి
గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు రైతులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుత జాడను కనుక్కోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
News February 4, 2025
సిద్దిపేట కమిషనరేట్‌లో 544 అవగాహన కార్యక్రమాలు
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి 544 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్రంలో మూడో స్థానం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచిందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.