News January 14, 2026

బస్సులో ప్రయాణించిన మంత్రి సురేఖ

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐనవోలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో మంత్రి సురేఖ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ టికెట్ పొంది ప్రయాణించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

Similar News

News February 11, 2026

PDS బియ్యం నాణ్యతపై కేంద్రాన్ని వివరణ అడిగిన ఎంపీ కావ్య

image

తెలంగాణలో ప్రజాపంపిణీ వ్యవస్థ(PDS) ద్వారా పంపిణీ అవుతున్న బియ్యం నాణ్యతపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా PDS బియ్యం నాణ్యతపై ఫిర్యాదుల పరిస్థితి ఏంటి? కేంద్ర సంస్థలు, FCI నిర్వహించిన తనిఖీల వివరాలేంటి? నాణ్యత లోపాలు తలెత్తితే తీసుకున్న చర్యలేంటి? అంటూ కేంద్రాన్ని ఎంపీ సమగ్రంగా వివరణ కోరారు.

News February 11, 2026

HYD: ఏ జోన్‌లో ఎంతమంది కార్పొరేటర్లు అంటే?

image

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించారు. మల్కాజిగిరిలో 3 జోన్లు(మల్కాజిగిరి, Uppal, LBనగర్), 14 సర్కిళ్లు, 74 వార్డులున్నాయి (కార్పొరేటర్). HYDలో 6 జోన్లు(శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, SEC BAD), 30 సర్కిళ్లు, 150 వార్డులున్నాయి. సైబరాబాద్‌లో 3 జోన్లు(శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్), 16 సర్కిళ్లు, 76 వార్డులున్నాయి. మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులు.

News February 11, 2026

ఆసీస్‌కు షాక్.. గాయంతో కెప్టెన్ దూరం

image

T20 WC వేళ ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ గజ్జల్లో గాయం కారణంగా ఇవాళ్టి ఐర్లాండ్‌తో మ్యాచుకు దూరమయ్యారు. దీంతో హెడ్ కెప్టెన్సీ చేపట్టారు. మార్ష్ గాయం తీవ్రతను చూస్తే అతడు లీగ్ స్టేజీ మొత్తానికి దూరమయ్యేలా కనిపిస్తోంది. దీంతో AUS అతడి ప్లేస్‌లో స్టీవ్ స్మిత్‌ను తీసుకుంది. అతడు ఇప్పటికే శ్రీలంకకు బయల్దేరారు. ఇటీవల BBLలో స్మిత్ 6 ఇన్నింగ్సుల్లో 299 రన్స్‌తో రాణించారు.