News September 23, 2025

బస్సులో ప్రయాణించి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

DSC నియామక పత్రాల జారీ కార్యక్రమ సభకు వచ్చే వాహనాల రాకపోకల మార్గాలను కలెక్టర్ తమీమ్ అన్సారీయా ఇతర జిల్లా ఉన్నతాధికారులతో కలసి స్వయంగా బస్సులో ప్రయాణించి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండే విధంగా అవసరమైన చోట రహదారులను వెడల్పు చేయించడం, మరమ్మతులు చేయించడం వంటి పలు అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులు ఉన్నారు.

Similar News

News September 23, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 50%కు పడిపోయిన అమ్మకాలు

image

గుంటూరు మిర్చీ యార్డులో 50% కు అమ్మకాలు పడిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో లారీల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. మిర్చి ధర కూడా క్వింటాకు రూ. 800 వరకు తగ్గుదల అయ్యింది. రానున్న 10 రోజుల్లో రోజుకి 25 వేల టిక్కీల వరకు విక్రయం కూడా కష్టమే అనే మిర్చి ట్రేడర్లు చెబుతున్నారు.

News September 22, 2025

ANU: దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య 2025-26 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ VC గంగాధరరావు, రెక్టార్ శివరాం ప్రసాద్ లు సోమవారం విడుదల చేశారు. ఎంబీఏ 600 మందికి 435మంది, ఎంసీఏ 128 మందికి 80మంది అర్హత సాధించారన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.anucde.info. నుండి ఫలితాలు పొందవచ్చు అన్నారు.

News September 22, 2025

దసరా సెలవులు ప్రకటించినా… కొన్ని పాఠశాలలు కొనసాగింపు

image

రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పరీక్షల పేరుతో, మరికొందరు సిలబస్ పేరుతో సెలవులు ఇవ్వకుండా స్కూల్ తరగతులు కొనసాగిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.