News October 24, 2025

బస్సు అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి దిగ్బ్రాంతి

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామ సమీపంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 24, 2025

నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.

News October 24, 2025

చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

image

TG: ఆర్‌అండ్‌బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్‌తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.

News October 24, 2025

జనగామ: కార్తీక మాసం.. మూడో రోజు ఆకాశ జ్యోతి

image

కార్తీకమాసం మూడో రోజును పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి ఆకాశ జ్యోతిని వెలిగించారు. ఆలయ పూజారి సాంబమూర్తి భక్తిశ్రద్ధలతో శివపార్వతుల ప్రత్యేక హారతి, పూజలు చేశారు. నమో పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలో ఆలయం మారుమోగింది.