News October 25, 2025

బస్సు దగ్ధం.. రావులపాలెం వాసి మృతి

image

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు దగ్ధం ఘటనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు చిక్కుకున్నారు. రావులపాలెంకు చెందిన క్రేను ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి రెండు రోజులు క్రితం పనుల కోసం HYD వెళ్లాడు. వేరే పని ఉండడంతో బెంగళూరు వెళ్లడానికి బస్సు ఎక్కి, ప్రమాదంలో మరణించాడు. కాగా అనపర్తికి చెందిన రామారెడ్డి, కాకినాడకు చెందిన సత్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Similar News

News October 25, 2025

అనుమతి లేకుండా చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దు: కోర్టు

image

అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. పేరు, ఫొటోల ఏఐ మార్ఫింగ్‌తో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఇటీవల చిరు కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. టీఆర్పీ, లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో 30 మందికి నోటీసులు జారీ చేసింది.

News October 25, 2025

వనపర్తి: ఇంటర్ విద్యార్థుల నుంచి గుర్తింపు, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు

image

ప్రభుత్వ సెక్టార్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు రూ.220,గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు CGG వెబ్ పోర్టల్ tgbie.cgg.gov.inలో చెల్లింపు గేట్‌వే ఉపయోగించి జమ చేయాలని కాలేజీ ప్రిన్సిపల్‌లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News October 25, 2025

డీసీపీపై దాడికి యత్నం.. కాల్పులు

image

TG: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం రేగింది. విక్టోరియా గ్రౌండ్‌లో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై సెల్‌ఫోన్ దొంగ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో డీసీపీ అతడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగ తీవ్రంగా గాయపడగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.