News November 3, 2025
బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు.
Similar News
News November 3, 2025
జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.
News November 3, 2025
మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.
News November 3, 2025
రాబోయే 2 గంటల్లో వర్షం: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ సమయంలో 40-50kmph వేగంతో గాలులు వీస్తాయని, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.


