News December 12, 2025

బస్సు ప్రమాదంపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: అల్లూరి జిల్లా బస్సు <<18539495>>ప్రమాదంలో<<>> ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 12, 2025

మునగాకుతో ఎన్నో లాభాలు

image

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్‌, ఫినోలిక్‌లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

News December 12, 2025

తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

image

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.

News December 12, 2025

‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

image

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.