News August 15, 2025

బహుమతులు పొందిన శకటాలు ఇవే..!

image

79వ భారత స్వాతంత్ర్య వేడుకలను శుక్రవారం బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మొదటి బహుమతి విద్యుత్ శాఖ, రెండో బహుమతి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మూడో బహుమతి మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు కైవసం చేసుకున్నాయి.

Similar News

News August 16, 2025

HYD: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

image

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు కధీరవన్ పళని, జి.ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ.వెంకటాచారితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

News August 16, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
> జనగామ: చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన
> కొడకండ్ల: పొలంలో జాతీయ జెండా ఎగరవేత
> స్టేషన్ ఘనపూర్: డిప్యూటీ వార్డెన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే
> బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న దేవరుప్పుల ఎస్సై
> బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న పాలకుర్తి ఆర్ఐ

News August 16, 2025

HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

image

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.