News October 18, 2025
బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి: కలెక్టర్

బాణసంచా దుకాణాల వద్ద పటిష్ట భద్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శనివారం సాయంత్రం టెక్కలిలో పర్యటించిన ఆయన ముందుగా దీపావళి సామాగ్రి దుకాణాలను పరిశీలించారు. అనంతరం టెక్కలిలో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈయనతో పాటు ఆర్డీఓ కృష్ణమూర్తి, తహశీల్ధార్ సత్యం, ఎంపీడీఓ రేణుక, ఈఓ శ్రీనివాసరావు తదితరులున్నారు.
Similar News
News October 18, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 5వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఐదవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్ చివరి వారంలో జరుగుతాయని వెల్లడించారు.
News October 18, 2025
SKLM: రాష్ట్రస్థాయి విజేతగా శ్రీకాకుళం సన్‌రైజర్స్

విజయవాడలో రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్‌రైజర్స్ జట్టు మొదటి బహుమతి సాధించింది. కృష్ణాజిల్లా విజయం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఎస్.ఎస్.ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు (ఐఏఎస్) శనివారం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. బహుమతి గెలిచిన జిల్లా జట్టును డీఈఓ రవిబాబు అభినందించారు.
News October 18, 2025
మందస: 22 నెలల చిన్నారికి వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం

కేవలం 22 నెలల అతి పిన్నవయసులోనే మందస మండలం డిమిరియాకు చెందిన సీర మయూరి అద్భుత ప్రదర్శన కనబరిచింది. మయూరి తండ్రి సీర సంజీవ్ సాఫ్ట్వేర్, తల్లి శాంతి డాక్టర్‌గా కాగా.. శ్లోకాలు, పద్యాలను ఇష్టంగా పాడుతున్న చిన్నారి ఆసక్తిని గమనించి వారు తర్ఫీదునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 15 శ్లోకాలు చెప్పిన మయూరి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , IB రికార్డ్స్‌లో స్థానం కైవసం చేసుకుంది.