News December 15, 2025
బాణాసంచా కేంద్రాల్లో భద్రత తప్పనిసరి: జేసీ

బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిల్వ కేంద్రాల్లో సల్ఫర్, అమోనియా వంటి రసాయనాలు ఒక్కోటి 50 కేజీలకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News December 20, 2025
పేరెంట్స్ మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో!

AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్యకుమార్ సూచించారు. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్‌లు ఏర్పాటు చేశారు. 61,26,120 డోస్‌లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు.
News December 20, 2025
సంగారెడ్డి: జిల్లాలో PACS ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాల రద్దు

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. వీరి పదవీకాలం ఆగష్టు 14వ తేదీతో ముగిసినట్లు ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం తొమ్మిది జిల్లాల డీసీసీబీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న జరిగిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ఈ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది.
News December 20, 2025
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.


