News September 24, 2024

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: విశాఖ రేంజ్ డీఐజీ

image

దీపావళి పండుగకు బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టి శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి సూచిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో బాణాసంచా నిల్వలు, తయారీ, విక్రయాలు తదితర వాటిపై నిఘా ఉంచాలన్నారు.

Similar News

News August 30, 2025

SKLM: క్యూ ఆర్ కోడ్ రేషన్ కార్డుల పంపిణీ ముమ్మరం

image

శ్రీకాకుళం జిల్లాలో 6,51,717 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైందని. ఈ పంపిణీ సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంబంధిత కార్డుదారులు తమ రేషన్ షాప్ పరిధిలోని సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో కార్డులు తీసుకోవాలని సూచించారు.

News August 30, 2025

శ్రీకాకుళం: దోమలపై మహా యుద్ధం

image

జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఐదు లక్షల గాంబూసియా చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం అరసవల్లి దేవస్థానం ఇంద్రపుష్కరినిలో 750 చేప పిల్లలను వదిలారు. వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టే ప్రణాళికను పూర్తిచేయాలన్నారు

News August 30, 2025

టెక్కలి: బావిలో డెడ్ బాడీ కలకలం

image

టెక్కలి అక్కపువీధిలోని నూతిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసరావు(40) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఇంటికి సమీపంలోని బావిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.