News March 25, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 88 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకొని వచ్చారు. వేరుశనగలు 359 క్వింటాళ్లు రాగా గరిష్ఠ ధర రూ.6,411, కనిష్ఠ ధర రూ.5,100 లభించింది. మక్కలు 902 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,281 కనిష్ఠ ధర రూ.1,791 లభించింది. ఆముదాలు 10 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,300, కనిష్ఠ ధర రూ.5,870 లభించింది.

Similar News

News March 27, 2025

మహబూబ్‌నగర్‌లో ముమ్మరంగా రంజాన్ ఏర్పాట్లు

image

రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

News March 27, 2025

MBNR: రైతన్నకు మంచినీటి కష్టాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో రైతన్నలు, వ్యవసాయ కూలీలకు నీళ్లు లేక వేసవి కాలంలో అలుమటిస్తున్నారు. మార్కెట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, నీటి మూటలుగానే మిగులుతున్నాయని వారు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేసి వేసవిలో రైతులకు దప్పిక తీర్చాలని కూలీలు కోరుతున్నారు.

error: Content is protected !!