News November 29, 2024
బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ
ప్రాపర్టీ కేసులు, సైబర్ నేరాల కేసులలో బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్‌లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 29, 2024
అంజలి శర్వాణీని రిటైన్ చేసుకున్న యూపీ వారియర్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో టీమ్ఇండియా క్రికెటర్ అంజలి శర్వాణీని యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఆమెను గతేడాది వేలంలో ఆ జట్టు రూ.55లక్షలకు కొనుగోలు చేసింది. వచ్చే సీజన్ కోసం డిసెంబర్ 15న మినీ వేలం జరగనుండగా ఆయా ఫ్రాంజైజీలు పలువురు ప్లేయర్లను వదులుకున్నాయి. కాగా 2012లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలి తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు.
News November 29, 2024
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని నక్కల మిట్ట వద్ద ట్రాక్టర్ టైర్ పేలి బోల్తాపడటంతో మల్లికార్జున(25) మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ రామాంజనేయలు వివరాల ప్రకారం.. ఓర్వకల్ నుంచి వెల్దుర్తికి రాళ్ల లోడ్‌తో వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులు నాగేశ్వరావు, కృష్ణలను స్థానికులు హుటాహుటిగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 29, 2024
నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏర్పాటు
నంద్యాలలో ఎఫ్ఎం రేడియో స్టేషన్ నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 48 చోట్ల ఎఫ్ఎం రేడియో స్టేషన్లను నిర్మించేందుకు ప్రాంతాలను గుర్తించారు. అందులో భాగంగా ఏపీలో నంద్యాల, చింతపల్లి, విజయనగరం ప్రాంతాలను గుర్తించారు. నంద్యాలలో ఎక్కడ ఏర్పాటయ్యేది త్వరలోనే తెలియనుంది.