News March 18, 2025
బాధితులకు భరోసా కల్పించాలి: సూర్యాపేట ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి అర్జీలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని అన్నారు.
Similar News
News March 18, 2025
కోదాడ: చోరీకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు

చర్చిలో దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక చర్చిలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. నిర్మాణం కోసం తీసుకొచ్చిన కొత్త కిటికీలు, డోర్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించగా కాపలా వ్యక్తులు గమనించి కేకలు వేశారు. పారిపోయే క్రమంలో రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.
News March 18, 2025
MNCL: 21, 22వ తేదీల్లో ఇంటర్వ్యూలు

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాజువాలిటీ మెడికల్ అధికారి పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు ఈ నెల 21, 22వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి సులేమాన్ తెలిపారు. ఐదు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులలో సీఎంవో, ఆర్ఎంవో పోస్టులకు ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారికి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.
News March 18, 2025
HYD: ఇమ్రాన్ ఖాన్‌కు ‘పరేషాన్’!

ఇమ్రాన్ ఖాన్‌కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్‌స్టాలోనూ పలువురు HYD ఇన్ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.