News August 5, 2024

బాధితులకు సత్వరం న్యాయం చేసేందుకే గ్రీవెన్స్ డే: SP

image

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉ.10 గంటల నుంచి మ. 3 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాధితులకు త్వరిత న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 14 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

Similar News

News December 30, 2025

KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

image

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.

News December 30, 2025

KNR: సన్న బోనస్ ఊసేది..? రైతు భరోసా ఎప్పుడు..?

image

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

News December 29, 2025

కరీంగనర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు.. వివరాలివే!

image

జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST-5999, SC-36902 మంది ఉన్నారు. కాగా, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్‌లో 30 వార్డులు, 34555 జనాభా, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 జనాభా ST 286, SC 7623గా ఉంది.