News November 12, 2024

బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం: ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాధితులు నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు కోసం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 90 ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి, త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.

Similar News

News September 15, 2025

పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

News September 14, 2025

ఒంగోలు MP మాగుంటకు రెండవ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 84 ప్రశ్నలు అడగటంతోపాటు 6 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 73.53 శాతంగా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

News September 14, 2025

ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.