News July 8, 2025

బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.

Similar News

News July 8, 2025

NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

image

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

News July 8, 2025

కంది: మైనారిటీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లా కంది మండలలోని మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా హాస్టల్ వసతులను, ఆహార నాణ్యతను, బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

News July 8, 2025

కేటీఆర్ సెకండ్ బెంచ్ స్టూడెంట్: జగ్గారెడ్డి

image

TG: తమకున్న అనుభవాల ముందు KTR జీరో అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ‘సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్. KTR సెకండ్ బెంచ్ స్టూడెంట్. తన తండ్రి ఎమ్మెల్యే సీటు ఇస్తే డైరెక్ట్‌గా గెలిచారు. కేటీఆర్‌ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే పది మాటలు అంటాం. అనడం మానేస్తే మేమూ మానేస్తాం’ అని స్పష్టం చేశారు.